
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దీపావళి సందర్భంగా హుజురాబాద్ లోని దీపావళి టపాసుల యూనియన్ నూతన కార్యవర్గం ఆదివారం స్థానిక హై స్కూల్ గ్రౌండ్ లో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బుర్ర కుమార్ గౌడ్ రెండవసారి రెండు ఓట్ల మెజార్టీతో ఎన్నికవ్వగా ఉపాధ్యక్షుడిగా మంచికట్ల గౌతమ్ కుమార్, కోశాధికారిగా శివనాధుని భరత్ కుమార్ లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం ఎన్నిక పట్ల సభ్యులందరూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బుర్ర కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన సహాయ సహకారాలు సభ్యులందరికీ అందిస్తానని కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు భూపతి లక్ష్మయ్య, కోడితల నాగరాజు, మొలుగు భానుచందర్, గుండ్ల నరేందర్, కే కిరణ్ కుమార్, కిషోర్ కుమార్, ప్రేమ్, బన్నీ మైస తదితరులు పాల్గొన్నారు.







