Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ఎలాంటి అనుమతులు లేకుండా రూ.4 లక్షల 37 వేల విలువైన టపాసులు నిల్వ ఉంచగా వాటిని ఆదివారం సాయంత్రం హుజురాబాద్ పోలీసులు సీజ్ చేశారు. పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డులో నివసించే చొక్కారపు యాదగిరి అనే కిరాణా దుకాణ వ్యాపారి తన దుకాణంలో వీటిని నిలువ చేసి ఉంచగా పట్టుకున్నట్లు టౌన్ సీ ఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సూపర్ బజార్ ఏరియాలో ఉన్న చొక్కారపు యాదగిరి కొన్ని సంవత్సరాలుగా టపాసులు విక్రయిస్తున్నాడు.
ఆయన దుకాణంలో అనుమతి లేకుండా టపాసులు నిల్వ ఉంచారని వచ్చిన సమాచారం మేరకు దుకాణంలో పోలీసులు తనిఖీ చేశారు. ఈ మేరకు ఎలాంటి అనుమతి లేకుండా రూ.నాలుగు లక్షల ముప్పై ఏడు వేల విలువ గల క్రాకర్స్, టపాసులు దొరికినట్లు సీఐ తెలిపారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన టపాసులను సీజ్ చేసి ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హుజురాబాద్
పట్టణంతో పాటు మండలంలోని ఏ గ్రామంలోనైనా
అనుమతులు లేకుండా క్రాకర్స్, టపాసులు నిల్వ
ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు.






