మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లి., ఆద్వర్యంలో సంఘ అధ్యక్షుడు ఎడవెల్లి కొండాల్ రెడ్డి చేతుల మీదుగా మండలంలోని రంగాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రము ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమములో సంఘ పాలకవర్గ ఉపాధ్యక్షుడు ముద్రబోయిన శంకర్, పాలకవర్గ సభ్యులు గూడూరి ప్రభాకర్ రెడ్డి, బొడ్డు అనసూర్య, దండ భాస్కర్ రెడ్డి, యాళ్ళ సుజాత, గోస్కుల శ్రీనివాస్, ప్రతాప ఆంజనేయులు, నరెడ్ల మధుసూధన్ రెడ్డి, సంగాల రవీందర్, సిరికొండ లింగరావు, లోకిని సాయిలు, మూగల లక్ష్మారెడ్డిలతో పాటు మాజీ సర్పచ్ బింగి కరుణాకర్, మాజీ యమ్ పిటిసి బండి. రమేష్ మరియు సంఘ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కొండల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని గ్రేడ్ A రకం రూ.2320 మరియు సన్నరకాలకు తెలంగాణ ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తుందని, రైతులు అందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలరని విజ్ఞప్తి చేశారు.