Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని ఉద్యోగం పొందిన నాటి నుండి పదవి విరమణ అనేది తప్పనిసరిగా ఉంటుందని హుజురాబాద్ జ్యోతిరావు పూలే ఉత్సవ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు ఉప్పు శ్రీనివాస్ పటేల్ పేర్కొన్నారు. ములుగు జిల్లా రవాణా అధికారిగా విధులు నిర్వహించిన మహమ్మద్ సిరాజ్ ఉర్ రెహమాన్ పదవి విరమణ కార్యక్రమాన్ని భూపాల్ పల్లి జిల్లాలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన హాజరై ఈ విధంగా మాట్లాడారు. హుజురాబాద్ లో అనేక సేవలు నిర్వహించి అందరితో కలిసి మెలసి ఉండి ప్రజాప్రతినిధుల మన్ననలు పొందిన సిరాజ్ పదవి విరమణ చేయడం కొంత బాధాకరమైనప్పటికీ ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని భగవంతుని వేడుకుంటున్నట్లు శ్రీనివాస్ పటేల్ పేర్కొన్నారు..






