
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: నవంబర్ 09: పట్టణంలోని వరంగల్ ప్రధాన రహదారిలో ఎస్బీఐ ఏటీఎం పక్కన నివాసముండే అశోక్ ఇంట్లో శనివారం నాగుపాము కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం. నాగుపాము కనిపించే సరికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై, స్థానికంగా నివాసముండే స్నేక్ క్యాచర్ అఫ్టల్కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకొని గంటపాటు శ్రమించి, చాకచక్యంగా నాగుపామును బంధించి, పట్టణ శివారు అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి అనుకునే ఏటీఎం ఉండడం, అదృష్టవశాత్తు ఏటీఎంలో పాము లేకపోవడంతో ప్రమాదం తప్పింది.






