
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ రిపోర్టర్ చిలుకమారి సత్యరాజ్ తండ్రి, కాట్రపల్లి గ్రామపచాయతీ కారోబార్ చిలుకమారి రాజమౌళి గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులైన పాత్రికేయుడు చిలుకమారి సత్యరాజ్, బీసీ సంగం, పద్మశాలి సంఘం జిల్లా నాయకుడు చిలుకమారి శ్రీనివాసులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వోడితల ప్రణవ్ బాబు శనివారం రాత్రి సందర్శించి పరామర్శించారు. మృతుని చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. పాత్రికేయుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కొల్లూరు కిరణ్ కుమార్, రావుల వెంకట్, రావుల రాజేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
