
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆదివారము రోజు కమలాపూర్ మండల్ ఉప్పల్ గ్రామములో రాచకొండ డిసిపి స్పెషల్ బ్రాంచ్ పుల్ల కరుణాకర్ మరియు హైదరాబాద్ చర్చ్ ఫాదర్ రాజ్ బేల లను హుజురాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా అండ్ కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో శాల్వాలతో మరియు పుష్పగుచ్చాలు ఇచ్చి వారి గ్రామానికి వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి మంచి హోదాలో ఉన్నందుకు వారికి మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం అన్న తమ్ముల్లాగా కలిసి మెలిసి గంగా జమున తహజీబ్ లాగా ఉండాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల పరిషత్ మాజీ కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ ముజీబ్ హుస్సేన్, మైనార్టీ నాయకులు మొహమ్మద్ మురాద్ హుస్సేన్, మహమ్మద్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.






