Oplus_131072
– 12 లక్షలు మాకొద్దు.
మా 5 లక్షలు ఫ్రీజ్ తీసేయండి.
దళితరత్న అవార్డు గ్రహీత ప్రభు.
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): నిన్న హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహానికి దళిత బంధు లబ్ధిదారులు వినతిపత్రం ఇచ్చి ధర్నాకు దిగిన దళిత నాయకులు, లబ్ధిదారులను పోలీసులు విచక్షణ రహితంగా లాఠీ చార్జి చేసి దాడి చేయడాన్ని దళిత రత్న అవార్డు గ్రహీత అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ.. శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి దళిత బంధు కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని నమ్మ పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వకుండా, హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులను ఆర్థిక అభివృద్ధి చేయడం కోసం గత ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా సుమారు 18 వేల దళిత కుటుంబాలను ఎంపిక చేసి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేయగా మొదటి విడతగా 5 లక్షల రూపాయలు విడుదల చేయగా వివిధ రకాల వ్యాపారాలు పెట్టుకున్న జీవిస్తున్న తరుణంలో రెండో విడత ఐదు లక్షల రూపాయలను సుమారు 5500 మంది లబ్ధిదారుల అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఎదురుచూస్తున్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 12 లక్షల రూపాయలు వద్దని,
నియోజకవర్గంలో రెండో విడత రాని లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఫ్రీజ్ ను తొలగించి వెంటనే విడుదల చేయాలని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డికి ప్రభు విజ్ఞప్తి చేశారు. దళిత నాయకులు, దళిత బందు బాధితులు గత రెండు సంవత్సరాలుగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నిమ్మకు నీరె్తినట్లు ఉండడంతో శాంతియుత సుదీర్ఘ పోరాటాలు చేయడంతో ఎందరినో అరెస్టులు గృహ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టడం ఏంటని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న రెండో విడత దళిత బంధు పథకాన్ని ఫ్రిజ్లో ఉంచి దళితులను ఇబ్బంది పెడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఫ్రిజ్లో ఉన్న దళిత బంధు పథకాన్ని వెంటనే విడుదల చేయకుంటే నియోజకవర్గం లో ఉన్న లబ్ధిదారులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిన్న హుజురాబాద్ దాడికి గురైన ఉద్యమకారులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత నాయకులు, దళిత సంఘ నాయకులు రాజకీయ పార్టీలకు నాయకుల ఊబిలో పడకుండా దళిత బంధు లబ్ధిదారులను ఏకం చేసి ఉద్యమించాలని సూచించారు.






