
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిన్న జరిగినటువంటి దళితులపై దాడిని మరియు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి పై దాడిని దళిత నాయకుడు మంద రాజేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిన్న దళితులపై ఎమ్మెల్యే పై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. అయ్యా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణం బాబు.. గత 11 నెలల కాలం నుండి మీ ఇంటి చుట్టూ తిరగడం జరిగింది, ఈ జిల్లా మంత్రి చుట్టూ కూడా తిరిగినా కూడా మా దళితులను కనీసం గౌరవ ఇవ్వని వ్యక్తులు మీరు అన్నారు. దళిత బంధు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుంది అని అంటున్నారు కదా మరి మీరు ఒక అధికారిక ప్రకటన ఒక డేట్ చెప్పండి మీ అధిష్టానం తోటి మాట్లాడి ఒక డేట్ చెప్పండి, ఎందుకు మా దళితులను ఈ విధంగా మీరు మోసం చేస్తున్నారు అని పేర్కొన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు రెండో విడత ఇప్పిచ్చిన తర్వాత మీ మాటలు నిజమైన నమ్ముతాం అన్నారు. మీరు దళితులపైన కపట ప్రేమ మాత్రమే చూపిస్తున్నారు అని, రానున్న రోజులలో మల్లా మా దళితులపై మా మీదనే ప్రెస్ మీట్ లు పెట్టి మాపై దాడి చేసే విధంగా మీరు ఉసిగొలుపుతున్నారని ఆయన ఆరోపించారు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ లోపట దళితుల పట్ల ప్రేమ ఉంటే మీ అధిష్టానం నాయకులతోటి మీరు మాట్లాడి దళిత బంధు ఇప్పించిన తర్వాత గత ప్రభుత్వం ఇయ్యలేదు మేము ఈ దళిత బంధు అయిదు వేల మందికి ఇచ్చామని చెప్పుకోవచ్చు కదా అన్నారు. రానున్న స్థానిక ఎలక్షన్లలో ఏ కాంగ్రెస్ నాయకులు అయినా ఓట్ల కోసం వస్తే దళిత బంధు రెండో విడత రాణి ప్రతి ఒక్కరూ తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత దళిత బంధు నాయకులు రామంచ రాకేష్, కోడెపాక రక్షిత్, కొర్రి సతీష్, గాజుల కుమార్, దాసరపు నాగరాజు, బండారు ప్రశాంత్, అంబాల హరీష్, శరత్, జీడి అరుణ తదితరులు పాల్గొన్నారు.






