Oplus_131072
–కుల గణన కోసం గత 93 సంవత్సరాలుగా పోరాటాలు.
కులగణన బీసీల ఉద్యమ విజయం.
–బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 10: రాష్ట్ర ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా కుల గణన విజయవంతం చేయాలని బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం రోజు హుజరాబాద్ లో బీసీ సంఘాల నాయకులు సందెల వెంకన్న, ఇప్పకాయల సాగర్, చల్లూరి రాజేందర్ లతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. కులగణన కోసం గత 93 సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న కుల గణన బీసీల ఉద్యమ విజయమని దీనిని అడ్డుకోవడానికి పెత్తందారులు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ బీసీలు విద్యా, ఉద్యోగ, వ్యాపార రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కావాలని అనేక పోరాటాలు చేస్తున్నమని తెలిపారు. కానీ న్యాయస్థనాలు కులగణన లేకపోవడం వల్ల 50% సీలింగ్ కు మించి రిజర్వేషన్లు ఉండకూడదని ఆంక్షలు విధించిందని చెప్పారు. దేశంలో 52 శాతానికి పైగా ఉన్న బీసీలు రిజర్వేషన్లు సీలింగ్ వల్ల నష్టపోతున్నారని, సీలింగ్ ఎత్తివేయాలంటే శాస్త్రీయ పద్ధతిలో కులగనన చేయాలని న్యాయస్థానాలు పేర్కొన్నాయని తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన కోసం బీసీ సంఘాలుగా తాము అనేక పోరాటాలు నిర్వహించామని, చివరకు ఆమరణ దీక్షతో చావు నోట్లో తలలు పెట్టి విరోచితంగా పోరాడటం వల్ల ఈ కులగణన రాష్ట్రంలో సాధ్యమైతుందని చెప్పారు. రేపటి భవిష్యత్తు తరాలను మార్చే ఈ ప్రక్రియలో ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా పాల్గొని తమ వివరాలు ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేసి సమన్యాయం కోసం కృషి చేయాలని కోరారు. చారిత్రక కుల గణనను విఫలం చేయడానికి ప్రతిపక్ష బిజెపి పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెత్తందారులు, భూస్వాములు, జమీందార్లు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రలను తిప్పి కొడతామని, చైతన్యవంతమైన ఈ సమాజం తప్పకుండా కులగణనను విజయవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంతోనూ పోరాడి దేశవ్యాప్త కులగణనను సాధిస్తామని తెలిపారు.






