
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 10: కరీంనగర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున నిన్నటి రోజున హుజూరాబాద్ పట్టణంలో జరిగిన ధర్నా మరియు రాస్తారోకో వల్ల ఎంతో మంది సామాన్య జనం, ఆసుపత్రికి వెళ్లే వారికి, ఎమర్జెన్సీలో అంబులెన్సులో వెళ్లే వారికి ఈ ధర్నా మరియు రాస్తారోకో వలన ఇబ్బందులు తలెత్తడం జరిగిందని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి తెలిపారు. అటువంటి చర్యలపైన భారత కొత్త చట్టాల ప్రకారం చట్ట పరిధిలో కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదే విధంగా ఎవరైనా ఎలాంటి అనుమతులు, పర్మిషన్లు లేకుండా సభలు, సమావేశాలు, హైవేల మీద ఇతర మార్గాల మీద అక్రమంగా గుమ్మిగుడి ధర్నాలు గాని రాస్తారోకోలు చేయరాదు అన్నారు. ఎవరైనా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా సభలు, సమావేశాలు, హైవేల పైన ఇతర మార్గాల పైన ధర్నాలు రాస్తారోకోలు చేసి ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని ఎసిపి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరూ చేసినా ఎవరిని ఉపేక్షించబోమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కరీంనగర్ కమిషనరేట్ పోలీసు వారు
ప్రజలకు ఇబ్బంది కలిగించే వారి పైన కఠినంగా వ్యవహరిస్తారని ఏసీపి పేర్కొన్నారు.
