
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితెల ప్రణవ్ ఆధ్వర్యంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ గా పుల్లూరి స్వప్న -సదానందం, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, హుజూరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా గూడూరి రాజేశ్వరిని, వైస్ చైర్ పర్సన్ గా నామ్ పెళ్లి తిరుపతిని నియమించారు. కమలాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా తౌటం ఝాన్సీ రాణిని,
వైస్ చైర్ పర్సన్ గా దేశిని ఐలయ్యాని నియమించారు.
జమ్మికుంట, హుజురాబాద్, కమలాపుర్,మార్కెట్
పాలక వర్గాలకు, శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొన్నం, వోడితల ప్రణవ్
జమ్మికుంట, హుజురాబాద్, కమలపూర్,వ్యవసాయ మార్కెట్ నూతన చైర్మన్,వైస్ చైర్మన్ నియమితులైన మార్కెట్ చైర్మన్, డైరెక్టలను రాష్ట్ర బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అభినందించారు. రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, మార్కెట్ లో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని మార్కెట్ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని మంత్రి పొన్నం అన్నారు.

జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న- సదానందం

హుజురాబాద్ నూతన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గూడూరు రాజేశ్వరి.

కమలాపూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ తౌటo ఝాన్సీరాణి -రవీందర్






