మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
విద్యార్థులకు విద్యతోపాటు చట్టాల పట్ల అవగాహన అవసరమని హుజురాబాద్ సీనియర్ సివిల్ జడ్జి పిబి కిరణ్ కుమార్ అన్నారు. గురువారం హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….విద్యార్థులకు పుస్తక జ్ఞానం ఒక్కటే కాకుండా చట్టాల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ జ్ఞానం వల్ల భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా ఉండడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై కమల, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోస్కుల శ్రీనివాస్, న్యాయవాది కాసు ఐలయ్య, ప్రధానోపాధ్యాయులు మల్లేశం, కిష్ట స్వామి, తదితరులు పాల్గొన్నారు.