Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నూతన మండల కమిటీల నిర్మాణంలో భాగంగా సోమవారం ఉదయం హుజురాబాద్ సాయిరూప ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ హుజురాబాద్ ఇన్ ఛార్జ్ తుంగ ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు అప్పగిస్తూ ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అనుసరించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ వర్గీకరణను అందరికంటే ముందుగానే అమలు చేస్తానని మాట ఇచ్చి వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలను భర్తీ చేయడం వల్ల మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కావున వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమం చేయటానికి నూతన కమిటీల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఎమ్మార్పీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా రొంటాల రాజ్ కుమార్ ను నియమించారు. హుజురాబాద్ మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడిగా ఇమ్మడి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా శనిగరపు కుమార్ స్వామి, ఉపాధ్యక్షులుగా కొమ్ము సిద్దు, కార్యదర్శిగా రొంటాల సిద్ధులను నియమించారు. అదేవిధంగా మహాజన సోషలిస్ట్ పార్టీ హుజురాబాద్ మండల అధ్యక్షుడిగా శనిగరపు దేవేందర్, ఉపాధ్యక్షులుగా ఆకునూరి అర్జున్, మునిగాల పోచయ్య, దాట్ల బిక్షపతి మరియు ప్రధాన కార్యదర్శిగా తునికి సంజీవ్, కార్యదర్శిగా గజవల్లి రమేష్, చిందు లను నియమించారు. వీరికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ లు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పి రాష్ట్ర నాయకులు మారేపల్లి శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తడికమళ్ళ శేఖర్, రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ సూపరింటెండెంట్ కలవల మల్లయ్య మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నాయకులు పాల్గొన్నారు.






