Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతును రాజుగా చేయడమే తమ ప్రభుత్వ విధానమని,రైతులకు నమ్మకం కలిగించేలా మార్కెట్ కమిటీ పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. సోమవారం నాడు హుజురాబాద్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ ఇటీవల కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందించారు ప్రణవ్, తాను ప్రజల పక్షాన పోరాడే వ్యక్తినని సకాలంలో సీఎంఆర్ఏఫ్ చెక్కులు పంచకుండా రీల్స్ చేస్తూ టైంపాస్ చేసే ఎమ్మెల్యేకు పేద ప్రజల కష్టాలు ఏం తెలుసని అన్నారు. ఉపఎన్నిక సమయంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ చేత చెక్కులను బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలా పంపిణీ చేశారని ప్రశ్నించారు. తాను ఓడిన పేద ప్రజల పక్షాన ఉంటానని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు తాను అండగా ఉంటానని ప్రణవ్ తెలిపారు.







