
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈ సందర్భంగా వెన్నంపల్లి ,మండల్ సైదాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులలోని 28 మంది ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ అన్ని తరగతులకు ఆయా సబ్జెక్టులను బోధించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణానికి ఉపయోగకరంగా ఉంటాయని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి కొమ్మెర శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విద్యార్థులలోని సామర్ధ్యాలు ఈ సందర్భంగా గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులు వారి వారి అనుభవాలను ఉపాధ్యాయులతోను విద్యార్థులతోనూ పంచుకోవడం జరిగింది. తరగతిలో ఉపాధ్యాయులు ఎంతగానో శ్రమించి తమ బోధనను అందిస్తారో ప్రత్యక్షంగా తెలుసుకోగలిగామన్నారు. వారి వ్యయ ప్రయాసలు కళ్ళకు కట్టినట్లుగా అనుభవంలోకి వచ్చిందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కే శ్రీనివాస్ రెడ్డి, టీ జయగోపాల్ సింగ్, ప్రవీణ్ కుమార్, ఎం సత్య, సత్యనారాయణ రెడ్డి, కుమార్, జయప్రద, పద్మ, జ్యోతి, నళిని, సిఆర్పి బీస రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు.









