
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కలెక్టర్ ఆదేశాల మేర గురువారం మండల విద్యా వనరుల కేంద్రంలో జిల్లా విద్యాధికారి CH VS జనార్ధన రావు 53 స్కూల్స్ HM లతో మధ్యాహ్న భోజన ఏర్పాటు, అందిస్తున్న రుచికర మిడ్ డే మిల్స్ పై సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాధికారి CH VS జనార్ధనరావు నిన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజురాబాద్ లో మధ్యాహ్న భోజనం శుభ్రమైన పరిసరాల్లో రుచికరమైన భోజనం అందించారని, ఎలాంటి సంఘటన జరగలేదని విద్యార్ధినీ విద్యార్థులని, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులని అడిగి తెలుసుకున్నారు. కొత్త బియ్యంతో అన్నం ముద్ద అయ్యింది కాని విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరగలేదని విద్యార్థులు తెలిపారన్నారు.
ఈ మధ్యాహ్న భోజనం గురించి నిర్వహించిన సమావేశంలో మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, 13 ఉన్నత పాఠశాలల, 5 ప్రాథమికొన్నత, 32 ప్రాథమిక పాఠశాలల HMs పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజురాబాద్ మధ్యాహ్న భోజన నిర్వాహకులతో ఏ విదంగా రుచికరమైన భోజనం చేయొచ్చో తగు సూచనలు ఇచ్చారు.








