
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: దేశవ్యాప్తంగా నిర్వహించిన నాస్ 2024 పరీక్ష సైదాపూర్ మండలం వెన్నంపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా నిర్వహించారు. ఇందులో తొమ్మిదవ తరగతి విద్యార్థులు ఉత్సాహంగా తమ తమ సామర్థ్యాలను ఆ పరీక్షలో వ్యక్తీకరించారు. ఈ పరీక్ష ద్వారా పిల్లల్లోని అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించడంతో పాటు తదుపరి విద్యా లక్ష్యాలను ఏర్పరచు కోవడంలోనూ ఉపయోగపడుతుందని సైదాపూర్ మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదే రకంగా ఈ సర్వే ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి భౌతిక స్థితిగతులను, ఉపాధ్యాయులు బోధించే విధానాన్ని, విద్యార్థులు నేర్చుకునే విధానాన్ని మదింపు చేశారు. ఈ కార్యక్రమానికి యోగేశ్వర్ రుక్మాపూర్ సైనిక స్కూల్ నుండి పరిశీలకులుగా వ్యవహరించారు. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ గా స్థానిక మోడల్ కాలేజ్ విద్యార్థి లక్ష్మీప్రసన్న వ్యవహరించారు. ఈ నాస్ 2024 సాధన సర్వేను ఉద్దేశించి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సర్వే వలన ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.








