
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ బుధవారం టిసిటి ఎన్జీవో సంఘం పక్షాన సీఎం రేవంత్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏసిటిఓ ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీ రజ్విలకు ఇచ్చిన వినతి పత్రాలలో కోరమన్నారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఆరు సంవత్సరాల నుండి బదిలీ లేక ఒకటే ప్రాంతంలో పనిచేస్తున్నారనీ, బదిలీలు కావాలని ఎన్నోసార్లు సంఘం పక్షాన వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాకపోవటంతో మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లకు ఏసిటి ఓ లకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని రాష్ట్ర ఐటి మరియు ఇండస్ట్రీస్ శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు దృష్టికి కూడా తీసుకొని వెళ్లడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాకపోవటంతో ఈరోజు తెలంగాణ స్టేట్ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఈ సమస్య వెంటనే పరిష్కరించి జూనియర్ అసిస్టెంట్ లకు సీనియర్ అసిస్టెంట్లుగా మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏ సి టి ఓ ప్రమోషన్లు కల్పిచాలని వారిని కోరారు. అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రమోషన్లు బదిలీలు జరిగినప్పటికీ ఇప్పటివరకు మన వాణిజ్య పన్నుల శాఖలోనే ఈ సమస్య ఇప్పటివరకు పెండింగ్ ఉండటం చాలా బాధాకరమైన విషయమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఇదే వాణిజ్య పన్నుల శాఖలో ఏసిటిఓగా పని చేస్తున్న వారిని హోదా కల్పించాలని 2017 సంవత్సరంలో ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇప్పటివరకు పరిష్కారం కాకపోవటం చాలా బాధాకరమైన విషయమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీ ఓ లకు గజిటెడ్ హోదా వెంటనే ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు పోన్నం ప్రభాకర్, కొండ సురేఖ, సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, మజిలీస్ పార్టీ ఆరుగురు శాసనసభ్యులు, శాసనమండలి ఇద్దరు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 18 మంది, బిజెపి పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ పార్టీ నలుగురు ఎమ్మెల్యేలు, సిపిఐ పార్టీ శాసనసభ పక్ష నాయకులకు తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన వాణిజ్య పన్నుల శాఖలో ఉన్న తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన ఇన్ని రకాల రిప్రజెంటేషన్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ శాంత కుమారి ఎక్సైజ్ మరియు వాణిజ్య పనుల శాఖ రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఇవ్వటం జరిగిందన్నారు. అయినప్పటికీ 8 సంవత్సరాల నుండి ఇప్పటివరకు తెలంగాణ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయ కార్యాలయంలోనే ఈ ఫైలు 8 సంవత్సరాల నుండి అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడి నుండి ఎక్కడికో కదులుతూనే ఉంది తప్ప తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసి టి ఓ లకు ఇప్పటివరకు గజిటెడ్ హోదా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కొత్త పిఆర్సి కమిషన్ రికమండేషన్ చేయటం జరిగిందనీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఏసిటి ఓ లకు గజిటెడ్ హోదా ఇచ్చినచో తెలంగాణ ప్రభుత్వ ఖజానాపై ఎటువంటి భారం పడదు అని తెలిపారు. అయినప్పటికీ రెండవ పిఆర్సి కమిషన్ వద్దకు ఎసిటిఓ గెజిటెడ్ హోదా ఫైల్‌ను పంపించగ ఆర్థిక శాఖ ఖజానాపై ఎటువంటి భారం పడదు అని చెప్పారు. తెలంగాణ జే ఏడి సర్వీసెస్ కూడా ఏ సిటీవో లకు గజిటెడ్ హోదా వెంటనే ఇవ్వండి అని తెలియజేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఏ సి టి ఓ లకు గెజిటెడ్ హోదా దక్కకపోవటం చాలా విచిత్రం అని, ఇదే ఏసి టిఓ లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గజిటెడ్ హోదా ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ సి టి ఓ లకు ఎందుకు గజిటెడ్ హోదా ఎందుకు ఇవ్వడం లేదో అర్థమవ్వటం లేదన్నారు. మూడుసార్లు శాసనసభలో మజిలీస్ పార్టీ శాసన పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఈ విషయంపై మాట్లాడటం జరిగిందనీ, ఇప్పటివరకు కదలిక లేదు అన్నారు. మళ్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు లేఖ రాయగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ గ్రూప్ టు హోదాలో ఎస్ టి ఓ డిప్యూ టీ తాసిల్దార్ కోపరేటివ్ రిజిస్టర్ సబ్ రిజిస్టార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇలాంటి వారికి గ్రూప్ టూ లో తక్కువ మార్కులు వచ్చినవారు గజిటెడ్ అధికారులుగా ఆయా శాఖలలో కొనసాగుతున్నారన్నారు. కానీ గ్రూప్-2 లో మొదటి స్థానం ఎక్కువ మార్కులు వచ్చిన వారిని వాణిజ్య పన్నుల శాఖలో ఏ సిటిఓ పోస్ట్ ఇవ్వటం జరుగుతుందనీ, గ్రూప్2లో ఏ సి టి ఓ తప్ప మిగిలిన గ్రూప్2లో ఉన్న అధికారులందరూ ఆయా శాఖలను గజిటెడ్ హోదాలో కొనసాగుతున్నారన్నారు. కానీ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసిటిఓ లకు ఇప్పటివరకు దాదాపు 8 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన ఎన్నో రెప్రెసెంటేషాలు ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఈ సమస్య పరిష్కారం కాకపోవటం చాలా బాధాకరమైన విషయమని తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.






