మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పంజాల అరవింద్ గౌడ్ భారీ మెజార్టీతో గెలుపొందినట్లు వారు తెలిపారు. హుజూరాబాద్ మండలంలోని చెల్పుర్ గ్రామానికి చెందిన పంజాల అరవింద్ గౌడ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం జాతీయ యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వించగా హుజూరాబాద్ అధ్యక్ష పదవికి 12 మంది పోటీ పడగా అందులో భారీ మెజార్టీతో అరవింద్ గౌడ్ గెలుపొందారు.
యువజన కాంగ్రెస్ మండల కమిటీ వైస్ ప్రెసిడెంట్ (open) మేకల రాజ్ కుమార్, రేణికుంట్ల సందీప్,
వైస్ ప్రెసిడెంట్ (SC/ST) చల్లురి విష్ణు వర్ధన్, వైస్ ప్రెసిడెంట్ (OBC) సంపంగి అరుణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ (మైనార్టీ)
సాయిద్ సమీ, జనరల్ సెక్రటరీ (Open) పంజాల రాజు
ఈర్రంశెట్టి అజయ్, సెక్రటరీ గంట కిరణ్ రెడ్డి ఎన్నికయ్యారని వారు పూర్తి కమిటీ వివరాలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పార్టీ శ్రేయస్సు పై పనిచేస్తున్న నన్ను ఇంత భారీ మెజారిటీతో గెలిపించిన యువకులకు కృతజ్ఞుడిగా ఉంటానని అన్నారు. గతంలో ఎన్ఎస్యు ఐ మండల అధ్యక్షుడుగా, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గా మొదలైన ప్రస్థానం నేడు యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో నా గెలుపుకి కృషి చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అరవింద్ గెలుపు పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ అరవింద్ కి శుభాకాంక్షలు తెలిపారని ఆయన చెప్పారు.