Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు హైదరాబాద్ శంకర ఐ హాస్పిటల్ లో కంటి వైద్యం చేసుకున్న కాట్రపల్లి గ్రామ ప్రజలను జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక నిర్వాహకులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి బుధవారం సందర్శించి పరామర్శించారు. కంటి పరీక్ష చేయించుకున్న కాట్రపల్లి గ్రామ ప్రజలును పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి వృద్ధులకు అందులకు కంటిచూపు కల్పించాలని ఉద్దేశంతోనే ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి తెలిపారు.






