
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు మధు అలియాస్ మల్లన్న ఎన్కౌంటర్ లో మృతి చెందిన పెద్దపల్లి జిల్లా రానాపూర్ గ్రామంలో టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లా వాజేడు ప్రాంతంలో గత వారం రోజుల కిందట ఎన్కౌంటర్లో మృతి చెందిన ఏడుగురు మావోయిస్టులలో ఆరుగురు మావోయిస్టులు చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వారు కాగా తెలంగాణ రాష్ట్రము పెద్దపెల్లి జిల్లా రానాపూర్ గ్రామానికి చెందిన మావోయిస్టు నేత మధు అలియాస్ మల్లన్న మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు. మధు అన్న గత 30 సంవత్సరాల నుండి ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమ బాట పట్టాడు అని పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు, భార్య, కూతురు మధు అన్న మృతిపై శోక సముద్రంలో మునిగి తేలుతున్నారని, వారి కుటుంబానికి తన భార్య మీనా అక్కకు ధైర్యం కోల్పోవద్దని తన కూతురిని ఉన్నత చదువులు చదివిపించాలని తన కుటుంబానికి అండగా ఉంటానని ఆత్మ ధైర్యాన్ని నింపుతూ వారికీ 200 కేజీల బియ్యం సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రంమాదిగ, పౌర హక్కుల సంఘం నాయకులు గడ్డం సంజీవ్, టిపిసిసి లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ జీడి రవితేజ తదితరులు పాల్గొన్నారు.








