
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హైకోర్టు ఉత్తర్వులు మరియు జిల్లా విద్యాధికారి కరీంనగర్ ఆదేశంల మేరకు స్థానిక కరస్పాండెంట్ విశ్వ ప్రగతి విద్యాలయం, హుజురాబాద్ ని ప్రస్తుత పాఠశాల భవనమును ఖాళీ చేయమని గౌరవ జిల్లా విద్యాధికారి కరీంనగర్ ఇచ్చిన అదనపు రెండు రోజుల గడవు బుధవారం(నేటి)తో ముగుస్తున్నందున వీరు బుధవారం నుండి ఈ పాఠశాలలో ఎలాంటి తరగతులు నిర్వహించుటకు కోర్టు ఉత్తర్వుల మేరకు అవకాశం లేనందున భవనంను ఖాళీ చేయాలని హుజురాబాద్ ఎంఈఓ మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ భవనంలో పాఠశాల నడపబడినచో చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని, మరియు విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఒకవేళ ప్రస్తుత యాజమాన్యం తమ విద్యార్థుల చదువుకై తగు బాధ్యతలు తీసుకొనిచో, సమస్త విద్యార్థుల తల్లిదండ్రులను కోరేదేమనగా మీ పిల్లలకు ఎలాంటి విద్య ఆటంకం లేకుండా అందుబాటులో ఉన్న పాఠశాలల్లో అడ్మిషన్స్ చేర్పించబడునని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. కావున విపిఎస్ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.






