
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: హుజురాబాద్ లో కవి, గాయకులు నేర్నాల కిషోర్ బృందం మంగళవారం పాటల పల్లకిలో 32 గంటలు దగా పడ్డ కళాకారుల డప్పులు మోత పోస్టల్ ఆవిష్కరణ చేశారు. ఈనెల 12, 13 తేదీలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో కవి, గాయకులు నేర్నాల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారుల కోసం సంస్కృతిక సారధిని ఏర్పాటు చేసి 550 మంది కళాకారులకు ఉద్యోగాలు కల్పించిందని, ఆ నియమాకాలలో చాలా అవకతవకలు జరిగాయన్నారు. ఎంతోమంది అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారనీ నిజమైన కళాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వాన్ని నిలదీసిన కళాకారులకు రెండో విడతలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ నెరవేర్చకుండానే ఆగిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు పెంచి కళాకారులను ఆదుకోవాలని ఈ సభ కొనసాగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు మరియు ప్రముఖ కవులు కళాకారులు పాల్గొంటారన్నారు. .పోస్టర్ ఆవిష్కరణలో కళాకారులు, కొరియోగ్రాఫర్ గిన్నారపు శాంతి రాజ్, నమిండ్ల రాజేశ్వరరావు, మోరే మధు, జంగ అనిల్ కుమార్, ములుగు నవీన్, పోతారం సంజీవ్, దానంపల్లి స్వామి, లంక దాసరి కళ్యాణ్, అంతడుపుల ప్రభాకర్ తదితరులున్నారు.






