Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పేద ప్రజల సమస్యల పరిష్కారమే ద్యేయంగా లీగల్ ప్రొసీజర్ తో బలమైన ప్రోటోకాల్ సిష్టంతో ఏర్పాటైన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షురాలుగా హుజురాబాద్ కి చెందిన పులుగు లతరెడ్డిని నియమిస్తూ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ సంస్థ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర కమిటి సభ్యులు విలాసాగరం పృధ్విరాజ్ మరియు ఎండి హబీబ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలుగా నియామకమైన పులుగు లతరెడ్డి మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలుపుతూ తనకు ఈ పదవి రావడానికి కృషిచేసిన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్, కందుగుల మాజీ వార్డ్ మెంబర్ కాట్కూరి నాగరాజులకు కృతజ్ఞతలు తెలిపారు.






