
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్. హుజురాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో భారతీయల భాష దివస్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ బి శ్రీనివాస్ మాట్లాడుతూ… అన్ని భాషలకు మూల భాష సంస్కృతం అని, భాషలు నేర్చుకోవడం చాలా సులభం అని కానీ ప్రస్తుతం ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలి అని, దేశంలో అధికారికంగా 22భాషలు ఉన్నపటికీ 120పైగా భాషలు, 1500పైగా మండలికాలు కలవని అన్నారు. హెచ్ఎం తిరుమల మాట్లాడుతూ… భిన్నత్యంలో ఏకత్వం కలిగి
భారతదేశం ఐక్యంగా నేటికీ నిలబడిందని తెలిపారు. పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ వస్త్రధారణతో ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆసియా, ఈ స్వామిరావు, అర్చన అవస్తి శ్రీనివాస్ రోజా రాణి, పి ఈశ్వర్ రెడ్డి, మాధవిలత, మారుతి ప్రసాద్, శ్రీలత, శ్రావణి, మ్యాక రాములు, జమునరాణి, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.






