
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ హుజురాబాద్ అండ్ జమ్మికుంట శాఖల ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో టాప్రా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ అధ్యక్షతన పెన్షనర్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, గౌరవాధ్యక్షులు కట్ట నాగభూషణచారి మాట్లాడుతూ ఈరోజు పెన్షనర్స్ తమ పెన్షన్స్ రాజ్యాంగబద్ధంగా పొందడానికి మూలకారకుడైనటువంటి డిఎస్ నకార పెన్షనర్లకు ఆరాధ్య దైవం అని, వారి సేవలు అజరామరం మరియు చిరస్మరణీయమని అన్నారు. పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకార సేవలను వారు కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు NPS మరియు CPS విధానాన్ని రద్దు పరచి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈపీఎఫ్ 95 మరియు సీఎం పిఎఫ్ 98 సింగరేణి ఉద్యోగులకు కనీస పెన్షన్ 15 వేల రూపాయలు పొందునట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ ట్రెజరరి ఇటువంటి తిరుమలయ్య, జమ్మికుంట శాఖ అధ్యక్షులు గరిగ చంద్రయ్య, హుజురాబాద్ శాఖ అధ్యక్షులు చొల్లేటి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, సయ్యద్ మునురుద్దీన్, ఈ రామస్వామి, హుజురాబాద్ శాఖ ట్రెజరరీ మండల వీరస్వామి, జమ్మికుంట శాఖ గౌరవ అధ్యక్షులు శీలం మల్లేశం, సీనియర్ నాయకులు మారేపల్లి మొగిలయ్య, మేకమల్ల సుధాకర్, పరాంకుశం సనత్ కుమార్, తాటిపాముల కనుకయ్య, దొంత హరికిషన్, గంగిశెట్టి సాంబయ్య, తాళ్లపెళ్లి రామకృష్ణ, తౌటం శ్రీహరి, ఎం రవీందర్, ఎస్ సారభద్రస్వామి, గాజర్ల బుచ్చిరాజం, జక్కే లక్ష్మయ్య, ఓరెమ్ వీరయ్య, జానపట్ల కాంతయ్య, మంతెన సుదర్శన్, కే రవీందర్ రెడ్డి, వేల్పుల భాస్కర్, నల్ల రాజిరెడ్డి, గూడూరి స్వామి, ఎస్ వెంకన్న, ఎల్ రవీందర్ రెడ్డి, వి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.







