
మండల యాదగిరి,స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్,డిసెంబర్ 17: హుజురాబాద్ తో పాటు జిల్లాలోని పట్టణాల్లోని, మండల కేంద్రాల్లోని వైన్ షాపుల నిర్వాహకులు సిండికేట్ గా మారి ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న విషయంలో ఎక్సైజ్ శాఖ సూపరింటెండ్ వివరణ ఇవ్వాలని ప్రపంచ వినియోగదారుల హక్కుల కరీంనగర్ జిల్లా వైస్ చైర్మన్ కోయల్ కార్ శ్యామ్ కోరారు. మంగళవారం ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కరీంనగర్ జిల్లా సూపరింటెండెంట్ కు రిజిస్టర్ పోస్టు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ జిల్లాలో విచ్చలవిడిగా సిండికేట్ దందా కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ మధ్యకాలంలో సిండికేట్ దందాపై వివిధ దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎక్సైజ్ శాఖ అధికారులను వివరణ కోరినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సిండికేట్ దందాపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
