
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులలో సిసి కెమెరాల ఏర్పాటు, క్లీనర్, డ్రైవర్ నియామకాలలో జాగ్రత్తలు వహించాలనీ కోరుతూ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్ హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్ బస్సుల లోపల, ముందు, వెనకాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా అమ్మాయిలను రైట్ సైడ్ లో, అబ్బాయిలను లెఫ్ట్ సైడ్ లో అదేవిధంగా బస్సు డ్రైవర్ మరియు క్లీనర్ అనుభవజ్ఞులను నియమించాలని సూచించారు. నిన్న 27న పట్టణంలో ఓ మైనర్ విద్యార్థినిపై జరిగిన సంఘటన పునరావృతం కాకుండా ప్రైవేట్ విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలని, వీటన్నిటిని పర్యవేక్షించాలని ఎంఈఓ కి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఉప్పు శ్రీనివాస్ పటేల్, పూలే కమిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్ఇల్లందు సమ్మయ్య, జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ మాజీ చైర్మన్. గోస్కుల మధు, మైనార్టీ నాయకులు సయ్యద్ సలీం, మహమ్మద్ అజ్జు తదితరులు పాల్గొన్నారు.

ఎంఈఓ విడపు శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేస్తున్న మహమ్మద్ ఖలీద్ హుస్సేన్, వివిధ సంఘాల నాయకులు..





