
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సామాజిక ఉద్యమాల రధసారధి పద్మశ్రీ మంద కృష్ణమాదిగ నాయకత్వంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన మాదిగ మృత వీరులకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్ ఆధ్వర్యంలో ఘనంగా పుష్పాలు, కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లను వర్గీకరించి ఎవరి వాటా వారికి దక్కే విధంగా 30 ఏళ్లు జరిగిన పోరాటంలో అమరులైన మాదిగ మృతవీరుల త్యాగం వల్ల ఈనాడు ఎస్సీ వర్గీకరణ ఫలాలు దక్కయని ఈ విజయాన్ని వారికి అంకితమిస్తున్నామని తెలిపారు. మాదిగ అమరవీరుల ఆశయాలను గుర్తు చేసుకుని వారి ఆశయాలను కొనసాగిస్తామని ప్రతినబూనారు. మాదిగ జాతి ప్రజలందరూ తమ పిల్లలను చదివించి ఉన్నత స్థితిలో నిలపాలని ప్రబోధించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రుద్రారపు రామచంద్రం, మారేపల్లి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు వర్ధినేని రవీందర్ రావు, బొరగాల మొగిలి, మహ్మద్ ఖాలీక్ హుస్సేన్, బండ వెన్నెల ప్రవీణ్, మరియు ఎంఈఫ్ జిల్లా కార్యదర్శి డాక్టర్ తడికమళ్ల శేఖర్, సీనియర్ నాయకులు కలవల మల్లయ్య, రుద్రారపు కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్, మహిళా నాయకురాలు ప్రియదర్శిని, వేల్పుల రత్నం, తునికి సమ్మయ్య, కనకం వెంకటస్వామి, మొలుగూరి ప్రభాకర్, బొడ్డు ఐలయ్య, కడారి ఆదాము, రాజేందర్, రామ్ రాజేశ్వర్, రొంటాల సుధీర్, మాడుగుల ఓదెలు, తెలంగాణ రాములు, జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మాదిగ అమరులకు నివాళులర్పిస్తున్న ఎంఎస్పి, ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ నాయకులు..






