
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన క్రీడలను కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్ ZPHS హై స్కూల్ గ్రౌండ్ ఆవరణలో రేపు(సోమవారం ఉదయం) నిర్వహిస్తున్న అని ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్థాయిలోని యువజన సంఘాలు మరియు డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణం కోసం కృషి చేయాలని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమ జిల్లా కోఆర్డినేటర్ మాడ వెంకట్ రెడ్డి, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు చేన్నమాధని నరసింహరాజు, ఆకుల రాజేందర్, కనుమల గణపతి, పట్టణాధ్యక్షుడు తూర్పాటి రాజు, దొంతరవేణ రమేష్ యాదవ్, తిప్పబత్తిని రాజు, కొలిపాక వెంకటేష్, మోటపోతుల రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

ఆటలపై సమీక్ష చేస్తున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి.






