
—గ్రామస్తుల చే ఘన సన్మానం.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కేంద్ర ప్రభుత్వం వీబీజీ రాంజీ గ్రామీణ ఉపాధి హామీ హామీ పథకాన్ని వ్యవసాయ రంగం తో అనుసంధానం చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర పై రైతుల భాగస్వామ్యంతో ప్రత్యేక రైతు చట్టం తీసుకు రావాలని ఈనెల 23న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి మహాధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళామని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
రాజ్యాంగ సవరణ ద్వారాఆర్ధికంగా వెనుక బడిన అగ్ర కుల పేదలకు విద్యా ఉద్యోగ రంగాల్లో కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయుటకు, ఓసి లోని పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అన్ని వర్గాల పేదలకు ఆర్థిక స్థితి గతులు ఆధారంగా సమన్యాయం జరగాలని అన్నారు.


పోలాడి రామారావును ఘనంగా సన్మానిస్తున్న వన్నారం గ్రామ కార్యదర్శి, గ్రామ పెద్దలు..
ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల పేదలకు రిజర్వేషన్ల ఫలాలు అందించాలని రామారావు డిమాండ్ చేశారు. శనివారం మానకొండూర్ మండల పరిధిలోని వన్నారం గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావును వన్నారం గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామ సభలో గ్రామ పంచాయతి పాలక మండలి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. డిల్లిలో ఈనెల 23న జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన జాతీయస్థాయి మహా ధర్నాకు నేతృత్వం వహించి ఓసిలోని పేదలతో పాటు అన్ని వర్గాల పేదలకు సమన్యాయం జరగాలని రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లిన ఇదే గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావును పలువురు గ్రామస్తులు అభినందించి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తాళ్ళ పల్లి సంపత్, బాకారాపు రాముల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించే రైతు భాగస్వామ్యం ఉండే రైతు చట్టం తేవాలని రైతులకు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని కోరుతూ మహా ధర్నాలో డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లినట్లు పోలాడి రామారావు వెల్లడించారు.
అన్ని వర్గాల పేదలకు ఆర్థిక స్థితి గతుల ఆధారంగా అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు రామారావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వన్నారం గ్రామ సర్పంచ్ తాల్లపల్లి సంపత్, ఉప సర్పంచ్ బాకారపు రాములు, మాజీ ఎంపీటీసీ గంగుల రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలుగంటి ఓదెలు పలువురు వార్డు సభ్యులు బనుక వేణు, మద్దెల తిరుపతి, హరికృష్ణ, తాళ్ళపల్లి తిరుపతి రజిత, బుద్దుల పర్షరాములు సీనియర్ నాయకులు బాకారపు రమేష్, తాల్లపల్లి కొమురయ్య, జంగిలి రాకేష్, పోలాడి యాదగిరిరావు, పోలాడి జగన్మోహన్ రావు, తాళ్ళపల్లి అంజయ్య, పోలాడి ప్రభాకర్ రావు, జంగిలి ఓదెలు, రవి, చిగురు రాజు, ప్రవీణ్, ఐలయ్య గ్రామ పంచాయతి ఉద్యోగులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రామారావు గురించి మాట్లాడుతున్న గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్..





