
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్ 18: కరీంనగర్ జిల్లా సగర ఉప్పర సంఘం కమిటీ పదవీ కాలము ముగియడంతో కమిటీని రద్దు చేస్తున్నట్లు సగర ఉప్పర సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ తెలిపారు. జిల్లా అధ్యక్షులు ఏరుకొండ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం పట్టణంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరికిషన్ మాట్లాడుతూ.. ఈ నెల 29న హుజూరాబాద్‌లోని కేరళ స్కూల్లో నూతన కమిటీ ఎన్నిక జరుగుతుందని, జిల్లా నగర ఉప్పర సంఘం సభ్యులు ఎన్నికను విజయవంతం చేయాలని కోరారు. కాగా జిల్లా రాష్ట్ర నాయకులను ఈ సందర్భంగా శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏరుకొండ ప్రసాద్, గౌరక్క సత్యం సాగర, మార్క సతీష్ సాగర, నలువాల బిక్షపతి, కానుగంటి శ్రీనివాస్ సగర, సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్, గుంటి శ్రీనివాస్, ఎంజాల వాసు, దేవునూరి శ్రీనివాస్, కురిమిళ్ళ రాజు తదితరులు పాల్గొన్నారు.








