
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి(సిరిసిల్ల) కరీంనగర్:
చేనేత పద్మ సమైక్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చిరు సహాయం
ఆత్మహత్యలు పాల్పడిన చేనేత కుటుంబాలను కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సాయం ఈరోజు సిరిసిల్లలో అందజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జడల చిరంజీవి మాట్లాడుతూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబానికి చేనేత భీమా కల్పించాలని అన్నారు. వారి కుటుంబంలో ఉన్న పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. అదేవిధంగా గత ప్రభుత్వం పరిపాలనలో బతుకమ్మ చీరలతో ఎంతో కొంత ఉపాయం దొరికిందని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా మా ఉపాధి కోల్పోయామని సిరిసిల్లలో ఉంటున్న కార్మికులు చెప్పారటారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారి ఆవేదనను గుర్తించి వారికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు కొండా రామ్మోహన్, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ జడల చిరంజీవి, అధికార ప్రతినిధి బాలరాజు, పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు మాటేటి సతీష్, సిరిసిల్ల కార్యవర్గం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






