
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(కామారెడ్డి): పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉంటానని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలువురు పట్టబద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. అనంతరం జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగ యువతకు ప VNR ఫౌండేషన్ ఆధవర్యంలో రూపొందించిన ఉచిత స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యల పై అవగాహన ఉన్న తనను ఆశీర్వదించి అవకాశం ఇస్తే చట్టసభల్లో పట్టభద్రుల గొంతుక వినిపిస్తానని స్పష్టం చేశారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని. విద్య రంగంనుండి తాను ఎమ్మెల్సీ గా బరిలోకి దిగుతున్నాని.. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతానని వెల్లడించారు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా లైబ్రరీ లలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతి, యువకులకు విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఉచిత స్టడీ మెటీరియల్ ను అందజేస్తున్నామని వెల్లడించారు .. పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలోని నాలుగు ఉమ్మడి జిల్లాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. రెండు నెలల తన పర్యటనలో పలు గ్రంథాలయాలను సందర్శించి.. తన వంతుగా చాలాచోట్ల మౌళిక సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు…
రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తున్నారని..వెల్లడించారు.. దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రం లోకిలైబ్రరీ లకు వచ్చి చదివుకునే నిరుద్యోగుల కోసం చాలా చోట్ల తన సొంత డబ్బులతో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతి యువకులు వీఎన్ఆర్ ఈ క్లాసెస్ ద్వారా ఉచితంగా అందజేసే స్టడీ మెటీరియల్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు… నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసిగెలిపించాలని విజ్ఞప్తి చేశారు..పోటీ పరీక్షల ఆశావాహులకు విఎన్ఆర్ ఫౌండేషన్ చేయూతను ఇస్తుందని గుర్తు చేశారు.. కరీంనగర్ జిల్లా కేంద్రం లోని TNGO ఫంక్షన్ హల్ లో నెల రోజుల పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బిఈడ్, డీ ఈడ్ అభ్యర్థులకు ఉచిత టెట్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పరిధిలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించానని.. పర్యటనలో భాగంగా చాలా మంది నిరుద్యోగులు వారి సమస్యలను తనకు వారి సమస్యలు తన దృష్టికి తీసుకు వచ్చారని.. వారి అభ్యర్తన మేరకు.. ఉచితంగా అల్ఫోర్స్ ఈ క్లాస్ యాప్ ను అందజేయగా అందులో ఇప్పటికే 50వేల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు అందులో 56 పోటీ పరీక్షలకు సంబంధించి స్టడీ మెటీరియల్ ఉంచినట్లు ఆయన వివరించారు..
అధైర్య పడొద్దు – త్వరలో ప్రభుత్వం శుభవార్త చెబుతుంది
- మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మీకు రక్షణ కవచంగా ఉంటా
- సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు సంఘీభావం..తెలిపిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కామారెడ్డి :సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కరీంనగర్ -అదిలాబాద్ -నిజామాబాద్ -మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు ..శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు గత కొన్ని రోజులు గా తమ డిమాండ్లు పరిష్కరించాలని చేపట్టిన సమ్మెకు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు… ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని.. ఎవరు ఆందోళన పడొద్దని ..ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టు కుంటుందని , ఉద్యోగులందరికి న్యాయం జరిగే విధంగావారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు…. మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని… ఏ ఒక్కరు అధైర్య పడద్దని త్వరలోనే ప్రభుత్వ మీకు శుభవార్త చెబుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..













