
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ డిసెంబర్ 31: ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత అయిన డాక్టర్ వి నరేందర్ రెడ్డి నూతన సంవత్సరం పురస్కరించుకొని హుజురాబాద్ లోని ఆల్ఫోర్స్ జీనియస్ స్కూల్లో ముందస్తు నూతన సంవత్సర సంబరాలు నిర్వహించారు. దానిలో భాగంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో నూతన సంవత్సరం వేడుకలు విద్యార్థులకు ఉత్తేజాన్ని, స్ఫూర్తిని నింపే విధంగా సంబరాలు జరిపారు. విద్యార్థులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలపడం,
మంచి ఆశయాలు, సంకల్పాలు పంచుకునే అవకాశం, సాంస్కృతిక కార్యక్రమాలైన పాటలు, నృత్యాలు, నాటికలు.
నూతన సంవత్సరానికి సంబంధించిన స్ఫూర్తిదాయక ప్రసంగాలు విద్యార్థుల ద్వారా, ప్రధానోపాధ్యాయులు లేదా ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నూతన సంవత్సరానికి సంబంధించిన స్ఫూర్తిదాయక సందేశం అందించారు. ప్రతి విద్యార్థి తాను మంచి పౌరుడిగా ఎదగాలని ప్రేరణ ఇవ్వడం. వేడుకలను సరదాగా, ఉల్లాసంగా నిర్వహించడంతో పాటు విద్యార్థులకు విద్యా, శీల సముపార్జనపై దృష్టి పెట్టాలని, అన్ని వయసుల విద్యార్థులు పాల్గొనేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. నూతన సంవత్సరం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఒక కొత్త దశగా ఉండాలని చూసుకోవాలన్నారు. మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే అవకాశం ప్రతి నూతన సంవత్సరంలో ఉందని దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.






*పత్రిక ప్రకటనలు*
———+——-+———-+————-+———-