
– వెంటనే స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్
– తెలంగాణ అడిషనల్ డీజీపీ లా & ఆర్డర్, కరీంనగర్ సీపీ కి నోటిస్
– ఎస్సై భార్గవ్ పై కేసు నమోదు చేస్తూ బాధితుడు మహేందర్ కు న్యాయం చేయాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ రూరల్ సీఐ, ఇంటెలిజెన్స్ పోలీస్ లు ఎస్సై భార్గవ్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారనీ టిపిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ ఆరోపించారు. ఈరోజు హుజురాబాద్ పట్టణ కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంఛార్జి తిప్పారపు సంపత్ మాట్లాడుతూ ఒక దళితుడైన పీజీ చదివిన విద్యావంతుడు బత్తుల మహేందర్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో సైదాపూర్ ట్రైనింగ్ ఎస్సై భార్గవ్ మాట్లాడుతుంటే ఫోన్ ఎత్తవని ఒక అహంకార ధోరణితో మహేందర్ ను చితక బాధి రెండు చెవుల కర్ణభేరీలు పగిలిపోయేలా కొట్టాడం జరిగిందన్నారు. గత 15 రోజుల నుండి కొంతమంది పోలీస్ అధికారులు ఎస్ఐ భార్గవ్ ను కాపాడే ప్రయత్నం చేస్తూ సిపికి తప్పుడు సమాచారం తప్పుడు నివేదికలు ఇచ్చారన్నారు. ఇప్పటికే రాష్ట్ర మన హక్కుల కమిషన్, రాష్ట్ర జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందనీ తెలిపారు. దళితుడైన మహేందర్ దెబ్బలు చూసి జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే స్పందించి తెలంగాణ అడిషనల్ డిజిపి లా &ఆర్డర్, కరీంనగర్ సీపీ కి వెంటనే నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్సై భార్గవ్ పై ఏం చర్యలు తీసుకున్నారు, నివేదిక ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. దళితుడైన బత్తుల మహేందర్ పై దాడిని మా దళిత సమాజం పై దాడిగా భావిస్తున్నామని, స్వాతంత్రం వచ్చి ఏండ్లు గడిచిన కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రజలను రక్షించవలసిన పోలీసులే అహంకార ధోరణితో దాడి చేస్తే ఎలా అని సంపత్ ప్రశ్నించారు. సైదాపూర్ ఎస్సై భార్గవ్ చేసిన పని పోలీస్ డిపార్ట్మెంట్ కే మచ్చ తెస్తుందని ఈ సందర్భంగా తెలియజేసారు. ఇలాంటి వ్యక్తులపై చర్య తీసుకోకుంటే ప్రజలకు పోలీసులపై నమ్మకం పోతుందని, ప్రజలు పోలీసులపై విశ్వాసం ఉండాలంటే నిజ నిజాలు తెలవాలని చెప్పారు. ఎస్సై భార్గవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో టిపిసిసి లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ జీడి రవితేజ న్యాయవాది, హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చెల్లూరి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.



జాతీయ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చూపెడుతున్న తిప్పారపు సంపత్..