
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జనవరి 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ క్యాంపును ప్రతీ మహిళ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక పేర్కొన్నారు. పట్టణంలోని మామిండ్లవాడలో బస్తీ దవాఖానలో గురువారం నిర్వహించిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ఆమె పాల్గొని, వైద్య పరీక్షలు చేపించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ఆరోగ్య మహిళ క్యాంపును ప్రతీ మహిళ తప్పక సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీంతో వ్యాధులను ముందుగానే గుర్తించి, సరైన వైద్యం అందించి మహిళలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేలా చేయవచ్చని గందె రాధిక అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారపళ్లి సుశీల, ఉజ్మా నూరిన్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో చందు, హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, చెల్పూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుకర్, డాక్టర్ జరీనా, డాక్టర్ గీత, హెల్త్ సూపర్ వైజర్ అనిత, హెచ్ వో విజేందర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సత్యం, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










