
–కౌశిక్ రెడ్డి మీద నమోదైన కేసులు ప్రజల కోసం పోరాడినవి కాదు.. నేర సామ్రాజ్యంలో భాగమే
– రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై అవాకులు చెవాకులు పేల్చితే ఖబర్దార్ అంటూ హెచ్చరిక
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జనవరి 16: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు లేదని, అసత్యాలు ప్రచారం చేస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు నమోదు అయ్యాయని, బిఆర్ఎస్ పార్టీ దొంగల ముఠా చేస్తున్న విషప్రచారాలను, సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఎండగట్టారు. గురువారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ దొంగల ముఠా నాయకులైన హరీష్ రావు, కేటీ రామారావు, కౌశిక్ రెడ్డిలు మీడియాలో తప్పు దోవ పట్టిస్తున్న అంశాలపై సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధారాలతో యుక్తంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013 నుంచి కౌశిక్ రెడ్డి మీద కేసుల పరంపర కొనసాగుతుందని ఆరోపించారు. 2013లో చంపుతానని బెదిరించిన ఘటనలో ఐపిసి506 కేసు, 2017లో ఐపిసి 507 కేసు, 506, 507, 447, వరంగల్ సుబేధారిలో లో 447, 427, వీనవంకలో ఐపిసి 504, 188, 174, ప్రభుత్వ ఉద్యోగి విధులను ఆటంకపరచడం చంపుతానే బెదిరించడం ఐపిసి351, 223, ఇలా17 కేసులు కేసీఆర్ ప్రభుత్వంలోనే నమోదు అయ్యయని విమర్శించారు. దొంగల ముఠా నాయకుడు హరీష్ రావు సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. 2014 నుండి 2023 వరకు కౌశిక్ రెడ్డి మీద నమోదైన కేసులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏవిధంగా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ దొంగల ముఠాను ప్రజలు అడుగడుగునా నిలదీయాలని కోరారు. మీడియాను, ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ గ్లోబల్ ప్రచారానికి దిగిందని ఆరోపించారు. నేటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో బిఆర్ఎస్ పార్టీ దొంగల ముఠా బాగోతం బట్ట బయలు అయిందన్నారు. 2013 నుంచి 2023 వరకు కౌశిక్ రెడ్డి మీద నమోదైన కేసులకు ఎవరు బాధ్యత వహిస్తారో, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి సచిలుడని, నిజాయితీపరుడని అసలు పదేళ్లలో జరిగిన నేరాలకు, నమోదైన కేసులకు ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తున్న దొంగల ముఠా నాయకుడు హరీష్ రావు నిస్సిగ్గుగా మాట్లాడటంపై దుయ్యబట్టారు. గత ఏడాది కాలంలో ప్రజా పాలన దెబ్బకు బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని 65 లక్షల సభ్యత్వం కాస్త 20 లక్షలకు దిగజారిందని, బిఆర్ఎస్ దొంగల ముఠా ఇప్పటికైనా కళ్ళు తెరచి గ్రహించాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి 40 లక్షల మంది ఎవరి దారి వాళ్లు చూసుకున్నారని, ఇంకా బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని ఊహించడం హాస్యాస్పదమన్నారు. మొన్న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుపై కౌశిక్ రెడ్డి దాడికి యత్నించాడని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ముందుగా, కౌశిక్ రెడ్డి చేయి పెట్టి నెట్టేసిన వీడియోను ప్లే చేసి చూపించారు. 40వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, మచ్చ లేనటువంటి, నిఖార్సయిన నేతను పట్టుకొని, మంత్రి శ్రీధర్ బాబు, నన్ను బెదిరించాడని ప్రెస్ మీట్ లో కౌశిక్ రెడ్డి ఆరోపించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. దౌర్జన్యానికి దిగిన, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని, నీవు జూలుం చేయొద్దని, ఎమ్మెల్యేగా నీకు పద్ధతి కాదని వారిస్తే, మంత్రి శ్రీధర్ బాబు, తనను బెదిరించారని ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇవన్నీ నేరపూరిత మైనటువంటి చరిత్ర కలిగిన కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తన మీద నమోదైన కేసులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టించిందని ఆరోపించడం, మరోవైపు కౌశిక్ రెడ్డికి మద్దతుగా దొంగల ముఠా నాయకుడు హరీష్ రావు, కేటీఆర్ మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. ఫార్ములా వన్ ఈకార్ రేస్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ నిధులను విదేశాలకు మళ్లించి అడ్డంగా బుక్ అయిన ఏవన్ నిందితుడు కేటీ రామారావు అని విమర్శించారు. తమకు సంబంధం లేకుండా రూ.55కోట్లను మళ్లించాడని, స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి, ప్రజల సొమ్మును ధ్వంసం చేసి, జులుంగా, దౌర్జన్యం గా ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకపరిచి, ఇలా వివిధ రకాలుగా ప్రజలను, ఉద్యోగులను హింసించి, చంపుతానని బెదిరించిన నేర సామ్రాజ్యానికి అధిపతిగా ఉంటూ, 28 కేసులతో అండర్ వరల్డ్ డాన్ మించిపోయిన కౌశిక్ రెడ్డి ఈరోజు నేను నీతి నిజాయితీ పరుడనని ప్రజల కోసం, రైతుల కోసం పోరాటం చేసే నాయకుడిని చెప్పుకోవడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో నేర చరిత్ర కలిగిన వారికి బీఆర్ఎస్ లో ఏ విధంగా రెడ్ కార్పొరేట్ వేస్తున్నారు సభ్య సమాజం ఆలోచన చేయాలన్నారు. దొంగల ముఠా నాయకులు ప్రజలను ఏ విధంగా వంచించడానికి ప్రయత్నిస్తున్నారో.. ప్రజా ప్రభుత్వాన్ని ఏ విధంగా బదనాం చేయడానికి వస్తున్నారో.. ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద చల్లడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. గత 12 సంవత్సరాలుగా లంగా పనులు దొంగ పనులు చేసి ఆ నెపాన్ని సీఎం రేవంత్ రెడ్డి మీద నెట్టేయడంపై మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయలు బిఆర్ఎస్ పార్టీ దొంగల ముఠా కొల్లగొట్టిన మొక్కవోని ధైర్యంతో కడుపు కట్టుకొని ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమమే జెండాగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై మరొక్కసారి అసత్య ఆరోపణలు అవాకులు, చెవాకులు పేల్చితే కాంగ్రెస్ కార్యకర్తలు అడుగడుగునా తన్ని తరుముతారని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో గుండటి శ్రీనివాస్ రెడ్డి, వాడే వెంకట్ రెడ్డి, శ్రవణ్ నాయక్, కోరివి అరుణ్ కుమార్, తాజద్దీన్, అర్ష మల్లేశం, భూమాగౌడ్, గంట శ్రీనివాస్, తమ్మిడి ఎజ్రా, మెరాజ్, ఆశ్రఫ్, మాసూమ్,నదీమ్, కీర్తి కుమార్, భారీ, జీడీ రమేష్, ఆంజనేయులు, అబ్దుల్ రహేమాన్, ఆమీర్ తదితరులు పాల్గొన్నారు.










