
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : అఖిల భారత యాదవ మహా సభ హుజూరాబాద్ పట్టణ,మండల సమావేశం శుక్రవారం రోజున పట్టణంలో అధ్యక్షుడు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు నగరం సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ.. యాదవుల ఎదుగుదలకి అందరూ పాటుపడాలని రానున్న స్థానిక సంస్థల్లో యాదవులు సత్తా చాటాలని రాజకీయంగా ఎదగాలని కోరారు. జనాభా ప్రతిపాదిక ప్రకారం బీసీలకు కేటాయించిన స్థానాలలో యాదవులు పోటీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మక్కపల్లి కుమార్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ బండి రమేష్ యాదవ్, నాయకులు కన్నబోయిన మహేందర్ యాదవ్, బెల్లి రాజయ్య యాదవ్, గడ్డి రాములు యాదవ్, గండు ప్రశాంత్ యాదవ్, బోయిని సంపత్ యాదవ్, మేరుగు రమేష్, శ్రీనివాస్, శంకర్, మాధమ్ ఐలయ్య, సమ్మయ్య, తిరుపతి, రాజు, సంపత్, మల్లికోట తదితరులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న యాదవ సంఘం నాయకులు





