
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తలకొక్కుల హరిప్రసాద్ ను(మనీషా ప్రసాద్) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక శిశు మందిర్ పాఠశాలలో శనివారం అసోసియేషన్ సభ్యులు సమావేము జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుందని సభ్యులు తీర్మానించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ…సంఘం కోసం సంఘ నియమాల కోసం పని చేస్తానని, సంఘము అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకంతో అధ్యక్షడుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ కి రాష్ట్ర కార్యదర్శి సిరి రవన్నకి మరియు రాష్ట్ర సలహాదారు కేదార్ రెడ్డికి, మాజీ అధ్యక్షులు మాచర్ల రాజుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు యాకుబ్ అలీ, ప్రధాన కార్యదర్శి దూలం చిరంజీవి, శ్రీశైలం, వోడపల్లి రాజు, మధుకర్, ఎడ్ల కుమార్, భాషబోయిన రాజేష్, బింగి మురళి, రాజేష్, మాడ రవీందర్ రెడ్డి, బిక్షపతి, మేకల రమేష్, శ్రీనివాస్, కొండ వేణు, బొప్ప నరేందర్, పేరాల మోహన్ తదితరులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.






