Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లిలో కరీంనగర్ డైరీ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇటీవల సెమెన్ ద్వారా పుట్టిన దూడ చూడిది కావడంతో దాని యజమాని బండారి కుమారస్వామికి ఆ డైరీ వారు ప్రోత్సాహకంగా రూ. 3 వేల విలువ చేసే దాన అందజేశారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఈ స్కీంని ప్రవేశపెట్టామని జాగీర్ పల్లి డైరీ అధ్యక్షుడు ఐలయ్య, కార్యదర్శి వీరస్వామి, విఏ తిరుపతి, డైరెక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్ రావుకు పాడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. డైరీ నిర్వాహకులు రైతులను ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయని కుమారస్వామి పేర్కొన్నారు.







