
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం మాడ మహేందర్ అనే నిరుపేద వైశ్యుడు మృతి చెందగా వారి ఆర్థిక పరిస్థితిని చూసి స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికా శ్రీనివాస్ ల సూచన మేరకు ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షుడు సుద్దాల హరిశంకర్, కార్యదర్శి నూక శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు దాతల సహకారంతో దహన సంస్కారాలు మరియు వారి పోషణ కొరకు రూ.1 లక్ష 18 వేల రూపాయలను విరాళాలుగా సేకరించి వారి కుటుంబానికి సోమవారం అందజేశారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబమైన మాడ మహేందర్ కుటుంబను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు గందే రాధికా-శ్రీనివాస్ కు మరియు ఆర్య వైశ్య సంఘానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు కోశాధికారి రేణికుంట్ల సురేష్, పాల కృష్ణమూర్తి, చందా విద్యాసాగర్, భూపతి లచ్చన్న ,ఐత సురేందర్, అప్పని రమేష్, చందా నగేష్ తదితరులు పాల్గొన్నారు.






