
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్): భగవాన్ సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని సాయి భక్తులు నిర్వహించే సేవా కార్యక్రమాలల్లో భాగంగా పురాతన శైవక్షేత్రాన్ని భగవాన్ సత్యసాయి భక్తులు శనివారం సందర్శించి ఆలయ ఆవరణలో ఉన్న ముళ్ల చెట్లను, అవసరం లేని మొక్కలను తీసివేసి ఆలయాన్ని శుభ్రపరిచి శుద్ధి చేశారు. ఈ సందర్భంగా సాయి భక్తులు మాట్లాడుతూ..మానవాళికి గొప్ప సేవాతత్వాన్ని తెలిపి ఆచరించిన మహోన్నత వ్యక్తి భగవాన్ సత్యసాయి అని అన్నారు. గొడిశాల, గుజ్జులపల్లె శివాలయంలో పరిసరాల శుభ్రత కార్యక్రమం నిర్వహించామని వారు అన్నారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు వారి వారి పరిసర ప్రాంతాలల్లో ఉన్న ప్రాచీన దేవాలయాలను సందర్శించి ఆలయాల శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాదంశెట్టి అంబరీష, బి.మనోజ్, సిద్ధి నమఃశివాయ, నార్ల శోభ రాజేందర్, కొత్తకొండ సుభాష్, గట్టు మహాదేవ్, రావి రాఘవులు, గొడిశాల, గుజ్జులపల్లె యూత్ సభ్యులు పాల్గొన్నారు.







