
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ ఉస్మాన్ సెట్ షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిదారులు మరియు వారి కుటుంబ సభ్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని షాపింగ్ కాంప్లెక్స్ ఈద్గా గేట్ ఎదురుగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అధ్యక్షులు నవాబ్ పాషా జాతీయ జెండాను ఆవిష్కరించి జనగణమన గీతాన్ని ఆలపించి జెండా వందనం చేశారు. గణతంత్రాన్ని సాధించిన మహనీయుల సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు పాల్గొన్నారు. వారితో పాటు జామే మస్జిద్ ఈద్గా అండ్ కబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అప్సర్, చందు, మొగిలి, సలీం, మక్సూద్, అలీం, అఫ్జల్, మతీన్, ముఖిద్, బాబా, మురాద్ హుస్సేన్, ఇర్ఫాన్, సల్మాన్, మునవర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.







