
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్) : సైదాపూర్ మండల్ ఆర్ఎంపి అండ్ పిఎంపి అసోసియేషన్ అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మి నరసింహ హాస్పిటల్ హనుమకొండ వారి సహకారంతో సంధ్యారాణి ఎండి, డి,జిఓ సహకారంతో సైదాపూర్ గ్రామంలో ఉచిత మెగా ఫెర్టిలిటీ క్యాంపును శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు అధిక సంఖ్యలో (150)మంది వచ్చి వారి ఆరోగ్య సమస్యలను వివరించగా వీరికి డాక్టర్ అక్షిత మరియు డాక్టర్ తేజస్విని పరీక్ష చేసి వారికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి వాటికి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం వారికి తగిన సూచనలు ఎండాకాలంలో వచ్చే మూత్ర సంబంధ మరియు గర్భసంచికి సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు రోజువారీగా సరిపడా నీరు త్రాగవలసిందిగా సలహాలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో హన్మకొండ లక్ష్మి నరసింహ హాస్పిటల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, హుజురాబాద్ ఏరియా ఇన్చార్జ్ పంజాల తిరుపతి గౌడ్, మహమ్మద్ రఫీ, పిఆర్ ఓ. ఇల్లందుల తిరుపతి, హాస్పిటల్ స్టాఫ్ ఫరఃహ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


