
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం బోర్నపల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎస్ కేవై గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నూతన టైలు, బెల్టులు, ఎగ్జామ్ ప్యాడ్లు మరియు అవసరమైన విద్యాసామగ్రి పంపిణీ చేశారు. విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తిని పెంపొందించడానికి, భవిష్యత్తులో మెరుగైన లక్ష్యాలను సాధించేందుకు ఈ విధమైన కార్యక్రమాలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్నారు. విద్యార్థులు సంతోషంతో తమ కొత్త విద్యాసామగ్రిని ప్రదర్శిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు మరియు యువత ముందుకు వచ్చి సహకరించారు.


ఎస్ కేవై గ్రూప్ సంస్థ అందజేసిన విద్యాసామాగ్రితో విద్యార్థులు, నిర్వాహకులు..





