
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం ముందు నుండి మీసేవ అనే ప్రాజెక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అప్పటి నుండి మీసేవ కేంద్రాల నిర్వాహకులకి ఏమైనా టెక్నికల్ సమస్యలు, రెన్యువల్, కొత్త సర్వీస్ లు, మీసేవ కేంద్రాల పర్యవేక్షణ గురించి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ (eDM), డిస్ట్రిక్ట్ మేనేజర్ (DM)లని నియమించారు. రాష్ట్ర ఆవిర్భవం తర్వాత కూడా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మేనేజర్ లు ప్రతి జిల్లాకు ఒకరు కొనసాగుతూనే ఉన్నారు. ఇందులో డిస్ట్రిక్ట్ మేనేజర్ ల నియామకాల ప్రక్రియ tgts, ts ఆన్లైన్ ద్వారా జరిగింది. ఇప్పుడు కూడా మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ ల ప్రక్రియ tgts, ts ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఇటీవల కొన్ని పరిణామాలు వలన మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ లను కొందరిని తీసేయడం, దూరంగా ఉండే జిల్లాలకు బదిలీల పక్రియ చేపట్టారు. ఈ పక్రియ అనుభవం మరియు డిస్ట్రిక్ట్ మేనేజర్ లు పని చేస్తున్న జిల్లాలలోని మీసేవ కేంద్రంల సంఖ్యల ఆధారంగా ఉంటుంది. కానీ ఇక్కడ tgts మీసేవ ప్రాజెక్ట్ ఉద్యోగులు ఇద్దరు, ts ఆన్లైన్ కి సంబందించిన ఒక టీం లీడర్ లు ఓ ప్రతిపక్ష పార్టీ నాయకునీ సూచనలు మేరకు అతను చెప్పిన విధంగా తనకి అనుకూలంగా ఉండేలా ఈ ట్రాన్సఫర్ ల ప్రక్రియని ఇస్టానుసరంగా చేసారు. దీని వలన అనుభవం, అర్హతలు ఉన్న కూడా కొందరు మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ లు ఉద్యోగం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఆ ప్రతిపక్ష నాయకునితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. దీనివలన కనీస ఉద్యోగ అర్హత, అనుభవం లేకున్నా వారి కింద మీసేవ కేంద్రంల సంఖ్య తక్కువగా ఉన్న కూడా వారిలో కొందరిని కథలపకుండా కొందరిని వారికీ అనుకూలంగా ఉండే జిల్లాలోనే కేటాయిస్తున్నట్లు సమాచారం. tgts మీసేవ ప్రాజెక్ట్ సంబందించిన ఉద్యోగులుకి, ts ఆన్లైన్ టీం లీడర్ లకి ఓ ప్రతిపక్ష రాజకీయ పార్టీ అండగా కూడా ఉంది. వీళ్ళు ఆ పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని ప్రచారంలో చర్చికుంటున్నారు. ఇప్పుడు ఉద్యోగం కోల్పోయిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ లకి ముందస్తు సమాచారం లేకుండా మధ్యంతరంగా తీసేయడం వలన వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారిలో దాదాపు 40 సంవత్సరాల వయస్సు గలవారే కాబట్టి ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని మరియు అనుభవం అర్హతలను బట్టి ట్రాన్స్ఫర్ల ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. అధికారంలో లేకున్నా ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఇలా అన్నీ విభాగంలలో తన పంతం నెగించుకోవడం హాస్యాస్పదంగా మారింది. ఏది ఏమైనాప్పటికీ మీసేవ జిల్లా మేనేజర్ ల ట్రాన్స్ఫర్స్ మరియు తొలిగింపులో అక్రమాలు జరిగినదానిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


