
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
ప్రతి విద్యార్థులో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీయాలని నేటి ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక రంగాల ప్రభావం మానవ జీవితంపై ఉందని మండల విద్యాధికారి బి శ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్ పర్సన్ జోస్ నెడుంతుండం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలని, అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన GSLVM3 అందరి దృష్టిని ఆకట్టుకుంది. అదేవిధంగా రోబోట్ విన్యాసాలు కూడా పాల్గొని ఉత్తేజపరిచాయి. అలాగే విద్యార్థులు ఏర్పాటు చేసిన బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ టెస్ట్, హైడ్రాలిక్ లిఫ్ట్, గ్లాస్ ఫర్ నైట్ బ్లైండ్ నెస్, హీమో డయాలసిస్, థర్మల్ పవర్ ప్లాంట్, లేజర్ అలారం, రేన్ వాటర్ హార్వెస్టింగ్ తదితర ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గీతా షాజు, డైరెక్టర్ షాజు థామస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






