
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య కి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని మెమోరాండం అందజేశారు. ఈ డంపింగ్ యార్డ్ ను హుజురాబాద్ లో నెలకొల్పుటకు ఏర్పాటు చేయుట గూర్చి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినారని తెలిసింది కనుక ఈ ప్రతిపాదనలను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ డంపింగ్ యార్డ్ హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేస్తే హుజురాబాద్ పరిసర ప్రజలు హుజురాబాద్ పట్టణ ప్రజలు అస్తమా పేషెంట్లుగా, క్యాన్సర్ పేషెంట్లుగా మారి ఇబ్బందులకు గురి అవుతారని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు. కనుక డంపింగ్ యార్డ్ ను విరమించుకోవాలని కమిషనర్ సమ్మయ్యకి విన్నవించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు బీసీ కులగనన మండల కన్వీనర్ మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్ ప్రజా సంఘాల నాయకులు, పర్యావరణ కమిటీ అధ్యక్షులు ఖాళీద్ హుస్సేన్, అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్ పూలే జయంతి కమిటీ అధ్యక్షుడు గడిపే రాజు స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ కొలిపాక సమ్మయ్యముదిరాజ్, సంఘం రాష్ట్ర నాయకులు మీడియా కన్వీనర్ తులసి లక్ష్మణమూర్తి పెండ్యాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


